Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోట్ల గిత్తలతో యువత కుస్తీ ఇక అధికారికమే!... 'జల్లికట్టు'కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తమిళనాట ఈ సంక్రాంతికి పోట్ల గిత్తలతో యువత పోటీ పడి మరీ పరుగెత్తనుంది. గిత్తల కొమ్ములు పట్టుకుని వంచేస్తూ తమ జబ్బ బలం కూడా చూపించనుంది. సంక్రాంతి సందర్భంగా తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోనూ కోడె గిత్తలతో యువకులు పోట్లాడే జల్లికట్టు ఏటా రసవత్తరంగా జరుగుతోంది. అయితే జంతు హింసతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు గాయపడుతున్న ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని ఇటీవల పలు వర్గాల నుంచి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని మోదీ సర్కారుకు వినతులు వెల్లువెత్తాయి. అనాదిగా కొనసాగుతూ వస్తున్న తమ సంప్రదాయానికి అడ్డు చెప్పొద్దంటూ తమిళ ప్రజలు రెండు ప్రభుత్వాలకు విన్నవించారు. తమిళుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈ సంక్రాంతి సందర్భంగా తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో జల్లికట్టు ఉత్సాహంగా జరగనుంది.

More Telugu News